Foxconn Plant at Kongara kalan: కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌, ఫ్లాంట్ ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

Foxconn Plant at Kongara kalan (Photo-Video Grab)

Hyd, May 15: రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ (Foxconn) టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ (Minister KTR) భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్‌ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో (Young liu) కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్‌. సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది.

వీడియో ఇదిగో, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే వాగ్వాదం

ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌ పవర్‌హౌస్‌గా తెలంగాణను మార్చుతున్నామన్నారు.



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

Patnam Narender Reddy Remand Report: కలెక్ట‌ర్ పై దాడి ఘ‌ట‌న వెనుక కేటీఆర్ హ‌స్తం! ప‌ట్నం న‌రేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు