Telangana MLC Election 2021 Results: బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయం, రెండవ స్థానానికి పరిమితమైన రాంచంద్రరావు, కొనసాగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.
Hyderabad, Mar 20: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఘన విజయం (trs-vani-devi wins) సాధించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.
ఈ నెల 17న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు రోజుల పాటు సాగింది.తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ విజయం దక్కకపోవడంతో మొత్తం 91 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ చేశారు. ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతగా 1, 12, 689 ఓట్లు రాగా..36, 580 ఓట్లు రెండో ప్రాధాన్యతగా వచ్చాయి. మొత్తంగా ఆమె 1, 49, 249 ఓట్లు సాధించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుకు తొలి ప్రాధాన్యత ఓట్లు 1,04, 068 రాగా, రెండో ప్రాధాన్యతా ఓట్ల కింద 32,898 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఆయన 1, 37, 568 ఓట్లు సాధించారు. వాణిదేవి విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.
తెలంగాణ భవన్‌లో కాసేపట్లో విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.
సురభి వాణిదేవికి వచ్చిన మొత్తం ఓట్లు 1,49,269
మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689
రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580
రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566
మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,04,668
రెండో ప్రాధాన్యత ఓట్లు 32,898
కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా నేడు, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఫలితం వెలువడింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు.