Telangana By-Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నికలు

రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.

Telangana By-Elections 2024 (file Image)

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.

వీడియో ఇదిగో, రోడ్డుపై కుప్పలుగా ప్రజా పాలన దరఖాస్తులు, నిర్లక్యం వహించిన అధికారిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ

ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. అదేరోజున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నది.