తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ర్యాపిడో బైక్ పై అభయహస్తం దరఖాస్తులు తరలిస్తుండగా అవి కిందపడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. దీనిపై విచారణకు అదేశించిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యుయేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఎస్ మహేందర్ ను జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. వార్డు నెంబర్ 13కు మహేందర్ టీమ్ లీడ్ గా పని చేశారు. దరఖాస్తుల ట్రాన్స్ పోర్ట్ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)