Revanth Reddy Arrest: గన్‌పార్క్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్, అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఈక్రమంలో పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం, తోపులాట జరిగింది. సోమవారం రోజు గన్‌పార్క్‌లో నిరసన తెలిపేందుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని రేవంత్ పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో తరలించారు. వీరి అరెస్ట్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రేవంత్‌ను పోలీసులు గాంధీభవన్‌కు తరలించారు.
కాగా మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం సవాల్ చేసిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని కేసీఆర్‌కు చాలెంజ్ విసిరారు.
Here's Video