Telangana Assembly Elections 2023: చంద్రబాబు ర్యాలీ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాక్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది.
Hyd, Nov 2: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబు ర్యాలీ నిర్వహాకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది.
ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుప ర్యాలీ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలై బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇదే చంద్రబాబు నాయుడు కొంపముంచింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
అయితే చంద్రబాబు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న తర్వాత నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దీనిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం నిబంధనలను అతిక్రమించడమేనని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు.
45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, మీరు చూపిన అభిమానం మరువలేనని తెలిపిన చంద్రబాబు
హైదరాబాద్‌లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పైగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి పొందాలి. 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ర్యాలీలో వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి, అంబులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ర్యాలీతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండుగంటలు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో ఎస్ఐ జయచందర్ పేర్కొన్నారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్‌లో ఉండి ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ రాగా మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను చంద్రబాబు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.