Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

ఓ వైపు కేటీఆర్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత గవర్నర్ వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొడుతుండటంతో వాట్ నెక్ట్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక నేతలు, గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana politics at Delhi, Is KTR booked in formula e case!(X)

Hyd, Nov 14: తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఓ వైపు కేటీఆర్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత గవర్నర్ వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొడుతుండటంతో వాట్ నెక్ట్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక నేతలు, గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఢిల్లీ వేదికగా గళం ఎత్తిన సంగతి తెలిసిందే. అలాగే మూసీ ప్రాజెక్టు పేరుతో ఢిల్లీ కాంగ్రెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి తోడు అమృత్ పథకం టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని స్వయంగా కేటీఆర్ కోరిన నేపథ్యంలో డిఫెన్స్‌లో పడ్డారు కాంగ్రెస్ నేతలు.

ఇక ఇదే సమయంలో గవర్న్ ఢిల్లీకి వెళ్లడంతో ఈ మ్యాటర్ కాస్త కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తిరుగుతోంది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఇందులో భాగంగా ఫార్ములా ఈ-కార్ రేస్‌ పేరుతో రూ.55 కోట్ల అవినీతి చేశారని కాంగ్రెస్ ఆరోపణ. దీనిపై కేటీఆర్‌ని విచారించేందుకు అనుమతివ్వాలని గవర్నర్‌కు లేఖ రాసింది.  కలెక్ట‌ర్ పై దాడి ఘ‌ట‌న వెనుక కేటీఆర్ హ‌స్తం! ప‌ట్నం న‌రేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు 

ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A, 2018 ప్రకారం ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిని విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం ఈ లేఖ రాసి 15 రోజులు గడుస్తున్న గవర్నర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

అయితే తాజాగా గవర్నర్ ఢిల్లీకి వెళ్లడంతో అటార్నీ జనరల్ అభిప్రాయం వచ్చాకే కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజభవన్ వర్గాల సమాచారం. దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఒక వేళ ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు