Danam Nagender Comments Row: తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన దానం నాగేందర్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన, తన పనితీరు గురించి అందరికీ తెలుసని వెల్లడి

ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు

MLA Danam Nagender (Photo-Video Grab)

Hyd, August 2: హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై దానం పరుషపదజాలం ఉపయోగించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. తాజాగా తన వ్యాఖ్యలపై దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

తాను సభలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. సభలో తాను సీనియర్ వ్యక్తిని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల దానం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన సభ్యులు తనను ప్రొవోక్ చేశారని, దీంతో తాను మాట్లాడవలసి వచ్చిందన్నారు. తన గురించి, తన పనితీరు గురించి అందరికీ తెలుసునన్నారు. అయినప్పటికీ తాను ఉపయోగించిన పదజాలం తెలంగాణలో మామూలే అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్... దానం వ్యాఖ్యలను పరిశీలించి అవసరమైతే రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగులకు నష్టం కలిగించే పనులు చేయమని వెల్లడి