Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన, ఈ జిల్లాలకు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుందంటే..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య వర్షాలకు విరామం ఉంటుందని అంచనా వేసింది. అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.