Telangana: ఎత్తు కొలుస్తానంటూ యువతిపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులు, రెబ్బెన ఎస్సై భవానీసేన్‌‌పై వేటు ఉన్నతాధికారులు, అవమానం తట్టుకోలేక ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం

ఈ నేపథ్యంలో యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది.

Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Hyd, jJuly 13: ఇటీవల హైదరాబాద్‌లో ఓ సీఐ, మరో ఎస్సై మహిళలపై లైంగికదాడుల ఘటనలు మరువక ముందే కుమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సైపైనా ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది. బాధితురాలి కథనం ప్రకారం రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.

పరీక్షకు సిద్ధమవుతోంది. స్టడీ మెటీరియల్‌ ఇప్పిస్తానని, పరీక్ష లేకుండానే పాస్‌ చేయిస్తానని రెబ్బెన ఎస్సై భవానీసేన్‌ (Rebbena SI Bhavanisen) నెల క్రితం యువతికి ఫోన్‌ చేసి స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. ఎత్తు కొలుస్తానంటూ స్టేషన్‌లోనే అసభ్యకరంగా (allegations of sexual harassment) ప్రవర్తించాడు. పలుమార్లు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం సోమవారం బయటకు పొక్కింది. యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సైపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

తుఫాకీతో బెదిరించి మహిళపై పోలీస్ అధికారి అత్యాచారం, మాజీ సీఐకి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, రేప్ కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు

అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఆపై ఎస్సైని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. కాగా, యువతి డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... స్టేషన్ల చుట్టూ తిరగడం ఇబ్బందవుతుందని ఇంట్లోవారు చెప్పడంతో కేసు విత్‌డ్రా చేసుకుంటున్నానని తెలిపింది.

కామాంధుడైన మరో పోలీస్ అధికారి, యువతిని బెదిరిస్తూ పదేళ్లుగా కోరికలు తీర్చుకున్న ఎస్ఐ, నీకు పెళ్ళి వద్దు నాతోనే ఉండాలంటూ బెదిరింపులు, అధికారిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

మరోవైపు ఎస్సై వ్యవహారం టీవీ చానళ్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవడంతో అవమానంగా భావించిన ఎస్సై భార్య మంగళవారం రెబ్బెనలోని ఎస్సై క్వార్టర్‌లో శానిటైజర్‌ తాగి, ఆత్మహత్యకు యత్నించింది. ఇరుగుపొరుగు వారు ఆమెను రెబ్బెన పీహెచ్‌సీకి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు



సంబంధిత వార్తలు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif