Telangana Road Accident: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులతో సహా 5 మంది అక్కడికక్కడే మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

Five Killed As Car Hits Tree

Hyd, Mar 4: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.  పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని, ప్రథమ చికిత్స అందించి పరీక్షా కేంద్రం దగ్గర దించిన మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌

మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



సంబంధిత వార్తలు