Telangana Shocker: తల్లికి క్యాన్సర్, తట్టుకోలేక కుటుంబం మొత్తం తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య, ఖమ్మంలో విషాదకర ఘటన

అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.

Representative image. (Photo Credits: Unsplash)

Khammam, June 23: ఖమ్మంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.

ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)లకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. అప్పుడు నమూనాలను పంపగా గురువారం క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమో థెరపీకి హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

భర్త, అత్తమామల వేధింపులు, ఫేస్‌బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, నాచారంలో విషాదకర ఘటన

తిరువూరు నుంచి స్వగ్రామానికి వచ్చేటపుడు 3 స్టూళ్లు, తాడు కొనుగోలు చేశారు. అనంతరం కొత్తకారాయిగూడెంలోని తమ మామిడితోటకు వారు చేరుకున్నారు. గురువారం రాత్రి అక్కడే మామిడిచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి సీఐ హనూక్‌, ఎస్సై సూరజ్‌ చేరుకుని పరిశీలించారు.

ఇక  మణికొండలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాయదుర్గానికి చెందిన అలివేలు(40), లాస్య(14) తమ నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.