Telangana Shocker: స్కూల్లో గుండెపోటుతో కుప్పకూలిన మూడో తరగతి విద్యార్థి, రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన

దీపావళి పండుగను ఆనందోత్సావాల మధ్య జరుపుకున్న ఓ చిన్నారి పాఠశాలకు వెళ్లిన తరువాత గుండెపోటుతో (Class III boy dies of heart attack) కుప్పకూలిపోయాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Sircilla, Oct 26: తెలంగాణలోని రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దీపావళి పండుగను ఆనందోత్సావాల మధ్య జరుపుకున్న ఓ చిన్నారి పాఠశాలకు వెళ్లిన తరువాత గుండెపోటుతో (Class III boy dies of heart attack) కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

జిల్లాలోని వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత– సతీశ్‌ దంపతులకు కొడుకు కౌశిక్‌(9), కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్‌లో నిలుచుని ఉన్న కౌశిక్‌ హఠాత్తుగా కిందపడిపోయాడు.గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.

కందిరీగల దాడిలో మహిళ మృతి, కొమ్మల్లో దాక్కుని ఒక్కసారిగా దినసరి కూలీని అటాక్ చేసిన కందిరీగలు

వైద్యులు పరీక్షించి కౌశిక్‌ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కాగా బాలుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత(హార్ట్‌ వీక్‌) వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్‌ మృతితో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. స్థానికులు వారిని చూసి కంటతడిపెడుతున్నారు.