Telangana Shocker: భర్త కాదు కిరాతకుడు, భార్యను చంపి, శవాన్ని ముక్కలుగా చేసిన డ్రమ్ములో దాచిపెట్టాడు, జూబ్లీహిల్స్‌ పరిధిలో దారుణ ఘటన

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను (Husband Kill Wife) చంపేశాడు ఓ కిరాతక భర్త. అంతేకాదు భార్యను రెండు ముక్కలుగా చేసి.. వాటర్‌ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Hyd, June 6: భాగ్య నగరంలోని జూబ్లీహిల్స్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను (Husband Kill Wife) చంపేశాడు ఓ కిరాతక భర్త. అంతేకాదు భార్యను రెండు ముక్కలుగా చేసి.. వాటర్‌ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌ నగర్‌ తండాకు చెందిన అనిల్‌, సరోజలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

అనిల్ కుమార్ అనే వ్య‌క్తి ఆరు నెల‌ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. మొద‌టి భార్య‌ను 2020లో హ‌త్య చేశాడు. అయితే రెండో భార్య స‌రోజ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే అనిల్, స‌రోజల మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఆమె త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. నెల రోజుల క్రిత‌మే స‌రోజ త‌న భ‌ర్త వ‌ద్ద‌కు తిరిగొచ్చింది. నాలుగు రోజుల క్రితం భార్య‌ను (man kills Second wife) డంబెల్‌తో కొట్టి చంపాడు. ఆ త‌ర్వాత శ‌రీరాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి.. ఇంట్లో ఉన్న డ్ర‌మ్ములో దాచి పెట్టాడు. ఆ త‌ర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

అర్థరాత్రి తోటలో నగ్నంగా శృంగారంలో మునిగి ఉండగా.., భార్యను వెతుక్కుంటూ వెళ్లిన భర్త అది చూసి షాక్, ఆ తర్వాత ఏం జరిగిందంటే...

సరోజ తండ్రి ఫోన్ చేసినా శనివారం నుంచి సరోజా ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. మరోవైపు అనిల్‌ కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో.. రెహమత్‌నగర్‌ సుభాష్‌ నగర్‌లో ఈ జంట ఉంటున్న ఇంటికి వచ్చాడు ఆయన. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్‌కు కాల్‌ చేశాడు. ఈసారి ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అనిల్‌.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి.. లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్‌ డ్రమ్‌లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది. సరోజను డంబెల్‌తో కొట్టి చంపి.. ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్‌ డ్రమ్‌లో కుక్కేశాడు అనిల్‌!. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనిల్‌ జాడ కోసం గాలింపు చేపట్టారు. సరోజ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు