Hyderabad Shocker: తెలంగాణలో ఘోర విషాదాలు, చిన్న పిల్లల్ని ముందు చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి తోసిపడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు

Representative Photo (Photo Credit: PTI)

Secunderabad, June 19: సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి తోసిపడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో తట్టుకోలేక ఆమె ఎనిమిదో అంతస్తు నుంచి తన ఇద్దరు పిల్లలను కిందికి పడవేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అవుతున్నారు. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి తరలించారు.

ఎండ దెబ్బకు తట్టుకోలేక విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి, యూపీలో విషాదకర ఘటన

కర్ణాటకలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఇద్దరు పసికందులతో కలిసి తండ్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కలబురిగి జిల్లా చించోళి తాలూకా కుంచావర సమీపంలోని పోచావరం గ్రామం వద్ద జరిగింది. కుంచావరకు చెందిన హనుమంత సంజప్ప వడ్డర్‌(40) తన కుటుంబంతో కలిసి తెలంగాణలోని తాండూరుకు వలస వెళ్లాడు.

నెల రోజుల క్రితం కుమారుడు ఓంకార(9), కుమార్తె అక్షర(6)తో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న తమ్ముడు గోపాల్‌కు శుక్రవారం ఫోన్‌ చేశాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, మీరే అంత్యక్రియలను చేయాలని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆందోళనకు గురైన గోపాల్‌ స్థానిక పోలీసులకు, సరిహద్దులో ఉన్న తెలంగాణ పోలీసులకు సమచారం ఇచ్చాడు.

దారుణం, యూపీలో దళితుడి ప్రైవేట్ భాగాలను కోసేసిన అగ్రవర్ణ వ్యక్తులు, అడ్డువచ్చిన భార్యపై గొడ్డలితో దాడి, వీడియో ఇదిగో..

పోలీసులు, ఫైర్‌ సిబ్బంది కుంచావరలోని బావులు, చెరువులు గాలించారు. ఆదివారం కుంచావరం సమీపంలోని పోచావరం గ్రామ తోటలోని బావిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.