Telangana Shocker: వెంటాడిన అనారోగ్యం..కొడుకును కృష్ణా నదిలో తోసేసి ఆ తర్వాత భార్యతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జెన్‌కో ఉద్యోగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్గొండ పోలీసులు

జెన్‌కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్‌కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య (Three Members of Family Die by Suicide) చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Representational Image (Photo Credits: ANI)

Nalgonda, July 25: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జెన్‌కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్‌కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య (Three Members of Family Die by Suicide) చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగి రామయ్య తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రామయ్యతో పాటు, భార్య నాగమణి, కుమారుడు సాత్విక్‌ను స్వగ్రామం చింతలపాలెంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌ విద్యుదుత్పాదన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మండాది రామయ్య (36), భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్‌ (13) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సాగర్‌ ప్రాజెక్టు దిగువన కృష్ణానది వంతెనపై రామయ్య బైక్, సెల్‌ఫోన్‌ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామయ్య నివాసంలో వెతకగా, సూసైడ్‌ నోట్‌ దొరికింది. తర్వాత బైక్‌ కన్పించిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ల సాయంతో వెతికారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.

రూ. 500 ఇస్తే మహిళల న్యూడ్ కాల్స్, కాల్‌గర్ల్స్‌ కావాలంటే మరో రేటు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు, మీడియాకు వివరాలను తెలిపిన సీఐ కళా వెంకటరమణ

దీంతో పోలీసులు శుక్రవారం ఉదయం మరోసారి గాలించగా, ముగ్గురి మృతదేహాలు నదిలో తేలుతూ కన్పించాయి. నాగార్జునసాగర్‌ ఆనకట్టకు దిగువన కృష్ణానది తీరంలోని చింతలపాలెంకు చెందిన రామయ్య భూమి సాగర్‌ ప్రాజెక్టు టెయిల్‌పాండ్‌లో ముంపునకు గురికావడంతో భూ నిర్వాసితుల కింద ఆయనకు జెన్‌కోలో ఉద్యోగం వచ్చింది. రామయ్యకు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో (health and financial issues) బాధపడుతున్నాడు. ఇటీవల మిర్యాలగూడలో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రామయ్య కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. తొలుత కుమారుడు సాత్వి క్‌ను బ్రిడ్జి పైనుంచి కృష్ణానదిలోకి తోసేసి (Jump into Krishna River) అనంతరం దంపతులు చేతులు పట్టుకుని దూకినట్లు తెలుస్తోంది. మొదట సాత్విక్‌ మృతదేహం, అనంతరం చేతులు పట్టుకుని ఉన్న రామయ్య దంపతుల మృతదేహాలు తేలినట్లు జాలర్లు చెబుతున్నారు. తనకున్నజబ్బులు బయటకు తెలిస్తే సమాజం చిన్నచూపు చూస్తుందని ప్రతికూల భావనతో కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

తిరుమలగిరి (సాగర్) మండలం చింతలపాలేనికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాల్లో భాగంగా రామయ్యకు జెన్‌కోలో అటెండర్ ఉద్యోగం లభించినట్టు పోలీసులు తెలిపారు.