Stray Dog Attack in Kazipet: పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి

గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాయి.

Stray Dogs (Photo Credits: PxHere)

Hyd, May 19: తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాయి.

వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి, వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులకు గాయాలు కాగా ఏడు మేకలు మృతి

తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద ఆడుకుంటుండగా చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా పని కోసం చోటు తల్లిదండ్రులు గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. పొట్టకూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.