Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, మాజీ SIB డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ప్రణీత్‌రావు ఉన్నారు.
Hyd, Mar 13: ఎన్నికలలో BRS ఓడిపోయిన తర్వాత SIBలోని ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) DSP ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతని ఇంటి నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ప్రణీత్‌రావు ఉన్నారు. గత మూడు రోజులుగా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఇకపై TS కాదు TG..తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ మార్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో నిఘా కెమెరాలు పని చేయకుండా చేసి ఆఫీసులోని హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్‌రావు కీలక నిందితుడి ఉన్నారు. అయితే, ఇటీవలే అధికారంలోకి వచ్చిన సర్కార్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ప్రణీత్‌రావుతో పాటు ఈ కేసులో సంబంధమున్న ఇతరులపై చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ ఆక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసు నమోదు చేశారు.
Here's News
కాగా, ప్రణీత్ రావు విచారణలో పోలీలసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్‌రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి దాదాపు 42 హార్డ్ డిస్క్‌లను మాయం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1,610 పేజీల కాల్ డేటాను సైతం కాలబెట్టినట్లుగా నిర్ధారించారు. ఇక కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్, ఓ కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈఐ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా ట్రాష్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.