Telangana: డిప్రెషన్ తట్టుకోలేక ఇద్దరు యువతులు ఆత్మహత్య, గచ్చిబౌలిలో 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థిని, మేడ్చల్‌ జిల్లాలో మరో యువతి అనుమానాస్పదంగా మృతి

వీరిలో ఒకరు 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకుపాల్పడగా..మరొకరు చదువులో వెనకబడిపోతున్నాననే బాధతో ఆత్మహత్య చేఃుకున్నారు.

Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Mar 23: తెలంగాణలో మానసిక ఒత్తిడిని జయించలేక ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకుపాల్పడగా..మరొకరు చదువులో వెనకబడిపోతున్నాననే బాధతో ఆత్మహత్య చేఃుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్‌మెంట్‌ ఎఫ్‌ బ్లాక్‌లోని 23వ అంతస్తులో ఇషా రంజన్‌(17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది.

జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు వదిలేసి స్టూల్‌ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్యకు (inter-student-ends-life) పాల్పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాచ్‌మెన్‌ గమనించి చెప్పగా తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా భర్తలు మౌనిక సిన్హా, సికెష్‌ రంజన్‌లు 2015లో విడాకులు తీసుకున్నారు.

మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుండగా తండ్రి అమెరికా వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఇషా రంజన్‌ కొద్ది నెలల క్రితం స్లీపింగ్‌ ట్యాబ్లెట్లు వేసుకొని, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై అత్యాచారం, ఆపై చేతిలో రూ.5 పెట్టిన కామాంధుడు, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్‌ అవుతున్నానని స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది. ఆత్మహత్యకు ముందు తల్లికి ‘మామ్‌ సారీ..ప్లీజ్‌ గివ్‌ లెటర్స్‌ టు మై ఫ్రెండ్స్‌’ అని సూసైడ్‌ నోట్‌ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇషా రంజన్‌ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మేడ్చల్‌ (Medchal) జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. పేట్‌ బషీరాబాద్‌లోచంద్రిక అనే ఇంజనీరింగ్‌ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో యువతి నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కాగా ప్రస్తుతం మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో ఉంటోంది. హాస్టల్‌ భవనం పైనుంచి దూకి చంద్రిక ఆత్మహత్య (Suspicious Death Of Engineering student) చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నన్నే రేప్ చేస్తావా..రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన యువతి, నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎంపీ పోలీసులు, నాపై కొడవలితో దాడి చేసిందని మహిళపై ఫిర్యాదు చేసిన నిందితుడు

ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్‌ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చం‍ద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు.