Telangana: కొంప ముంచిన అప్పులు, కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం, హత్యా లేక ఆత్మహత్యా తేల్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ అయి కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం (death in a fire accident) అయ్యారు. మృతులను మొండిగ రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్యగా గుర్తించారు.
Paloncha, Jan 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ అయి కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం (death in a fire accident) అయ్యారు. మృతులను మొండిగ రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్యగా గుర్తించారు. మరో కుమార్తె సాహితి గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
కాగా మొండిగ నాగ రామకృష్ణ పాల్వంచ ( Old Paloncha) నవభారత్‌లో మీ సేవ నిర్వహిస్తున్నాడు. అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. కాగా రామకృష్ణ డాడీస్ అనే ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయారని సమాచారం. అందులో పెట్టిన డబ్బులు తిరిగి రాకపోగా.. మరింత పెట్టుబడి పెట్టేందుకు స్నేహితులను కూడా అప్పులు అడిగినట్లుగా తెలుస్తోంది. అతడి పరిస్థితి తెలిసి ఎవరూ అప్పు ఇవ్వకపోవడం, ఇల్లు, కారును తాకట్టు పెట్టి డబ్బు కోసం ప్రయత్నించినా ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంపై (Three persons of a family were charred) పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో భార్యభర్తలతో పాటు కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోగా.. మరో కూతురు సాహితిని 108 సహాయంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.