Bhadrachalam, July 29: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది. శనివారం ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే 3 వేలకుపైగా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీగా వరద ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.
Godavari River Reaches To Danger Level In Bhadrachalam
Watch video>>>https://t.co/TaVEDfI0S0#Telangana #Bhadrachalam #Godavari #NTVNews #NTVtelugu
— NTV Telugu (@NtvTeluguLive) July 29, 2023
నీటమునిగిన స్నానఘట్టాల ప్రాంతం
గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతం మొత్తం నీట మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటిమట్టం 56 నుండి 58 అడుగులకు చేరుకునే అవకాశమున్నట్లు కలెక్టర్ తెలిపారు.