Dog Attack in Kamareddy: బాలుడి పొట్టను చీల్చేసిన వీధి కుక్కలు, కామారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడి, చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి..

ముదెల్లి గ్రామంలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగంలో దాడి చేసి బాలుడిని వీధి కుక్కలు లాక్కెళ్లాయి.

Stray Dogs (Photo Credits: PxHere)

Hyd, June 12: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముదెల్లి గ్రామంలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగంలో దాడి చేసి బాలుడిని వీధి కుక్కలు లాక్కెళ్లాయి. వీధి కుక్కల దాడిలో బాలుడికి పొట్ట, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులతో వీధి కుక్కలను స్థానికులు తరిమికొట్టారు.

రైల్వే లైన్ తగలడంతో కరెంట్ షాక్, మాడి మసైపోయిన క్లీనింగ్ కార్మికుడు, జాగ్రత్తగా లేకుంటే అంతే..షాకింగ్ వీడియో ఇదిగో..

బాబును చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.జిల్లాలోని గాంధారి మండలంల ముదెల్లిలో మూడేళ్ల బాలుడు ఫంక్షన్ హాల్ ముందు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఇంతలో చుట్టుపక్కల తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif