CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌.. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం.. మెనూలో నోరూరించే ఐటమ్స్ ఏం ఉన్నాయంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ స్కీం శుక్రవారం ప్రారంభం కానున్నది.

CM Breakfast Scheme (Credits: X)

Hyderabad, Oct 6: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌’ స్కీం (CM Breakfast Scheme)  శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా (Rangareddy) మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌ లో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30కి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. శుక్రవారమే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్ఫాహారాన్ని వడ్డిస్తారు.

CM Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చ, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం

అలా తొలిరాష్ట్రం తెలంగాణే

ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని తొలుత తమిళనాడులో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తమిళనాడులో 1-5 తరగతుల విద్యార్థులకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో 1 -10 తరగతుల్లోని విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్‌ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని పలు రాష్ర్టాల్లో 1 -8 తరగతుల వరకే అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నది. గత ఏడాది నుంచి బెల్లం కలిపిన రాగిజావను అందజేస్తున్నది. పదో తరతతి విద్యార్థులకు స్పెషల్‌ క్లాస్‌ సమయంలో ఉచితంగా స్నాక్స్‌ను ఏర్పాటు చేసింది.

చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ మెనూ ఇదే..



సంబంధిత వార్తలు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి