TRS Leader Murder: టీఆర్ఎస్ నేతను హత్య చేసి రెండు చేతులను తీసుకెళ్లిన దుండగులు,తెల్దారుపల్లిలో దారుణ హత్య కలకలం, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు.

TRS leader Krishnaiah murdered brutally in broad daylight in Khammam (Photo-Facebook)

Khammam,Agust 15: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు. కాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య (TRS leader Krishnaiah ). అయితే సీపీఎంతో విభేదించి.. టీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.

పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసి బైక్‌పై వెళ్తున్న కృష్ణయ్యను పక్కా ప్లాన్‌ ప్రకారం దుండగులు హత్యచేశారు. ఈఘటనలో కృష్ణయ్య స్పాట్‌లోనే చనిపోయారు. దుండగులు హత్య అనంతరం మృతుడి రెండు చేతులను తీసుకెళ్లారు. అయితే హత్యకు ముందు బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ముత్తయ్యను బెదిరించి పంపించారు. ఆ తర్వాత కత్తులతో ఏకధాటిగా దాడి చేశారు.

కోర్టులో ఉన్మాదిలా మారిన భర్త, అందరూ చూస్తుండగానే భార్య గొంతు కోసి దారుణ హత్య, కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి..

దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెల్దారుపల్లికి చెందిన ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య నేపథ్యంలో తెల్దారుపల్లిలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

కాలం చెల్లిన కొంతమంది ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇలాంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. వ్యక్తిగత ఎదుగుదల చూడలేక ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అభిమానులు సహకరించాలని కోరారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..