Vikarabad: కల్లు తాగి బావిలో ఈత, అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లను వెంటాడిన మృత్యువు, వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో విషాద ఘటన

ఉగాది పండగకు అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లను మృత్యువు వెంటాడింది. సరదాగా బావిలో ఈతకు వెళ్లి ఇద్దరే మరణించారు. ఓ వ్యక్తి నీట మునిగిపో తుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా మృత్యువాత (two sons in law fell into well and death) పడ్డాడు

Representational Image (Photo Credits: Twitter)

Vikarabad, April 12: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉగాది పండగకు అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లను మృత్యువు వెంటాడింది. సరదాగా బావిలో ఈతకు వెళ్లి ఇద్దరే మరణించారు. ఓ వ్యక్తి నీట మునిగిపో తుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా మృత్యువాత (two sons in law fell into well and death) పడ్డాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ( vikarabad district Tandur) మండలం కొత్లాపూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. కొత్లాపూర్‌కు (Kothalapur) చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. వెంకటప్ప కూతురు మాధవిని తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన కృష్ణ(31)కు ఇచ్చి వివాహం చేశారు. శ్యామప్ప కూతురు రేణుకను యాలాల మండలం గిరిజాపూర్‌కు చెందిన మహిపాల్‌(25) వివాహం చేసుకున్నాడు.

కృష్ణ, మహిపాల్‌ కోత్లాపూర్‌ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తూ అక్కడే ఉండే వారు. కొన్నిరోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఉగాది పండుగ కోసం కృష్ణ, మహిపాల్‌ కుటుంబాలు 2 రోజుల క్రితం కొత్లాపూర్‌కు వచ్చాయి. ఆదివారం ఉదయం మల్కాపూర్‌ గ్రామంలో ఓ పాలిషింగ్‌ యూనిట్‌ యజమాని వద్ద పని మాట్లాడేందుకు కుటుంబీకులతో కలసి వెళ్లారు. సోమవారం నుంచి పనికి వస్తామని యజమానికి చెప్పారు.

ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

అనంతరం కృష్ణ, మహిపాల్‌ ఇద్దరూ కల్లు తాగారు. తర్వాత బావమరిది నర్సింహులుతో కలసి కొత్లాపూర్‌ సమీపంలో రైతు పెంటయ్య బావిలోకి ఈతకు వెళ్లారు. మహిపాల్‌కు ఈత రాకపోవడంతో నడుముకు డబ్బా కట్టుకొని బావిలో దూకాడు. ప్రమాదవశాత్తు అతడు నీటిలో మునిగిపోతుండగా గమనించిన కృష్ణ వెంటనే అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు.

ఇద్దరూ కల్లు మత్తులో ఉండటంతో ఊపిరి ఆడక నీటమునిగి మృతి చెందారు. ఇది గమనించిన బావమరిది నర్సింహులు గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు విషయం తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ మృతదేహాలను బయటకు తీశారు. బతుకుదెరువు కోసం వచ్చిన కృష్ణ, మహిపాల్‌ మృతి చెందడంపై కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కృష్ణకు భార్య మాధవి, పిల్లలు అరవింద్‌ (7), భాగ్యశ్రీ (4) ఉన్నారు. మహిపాల్‌కు భార్య రేణుక, కూతురు అశ్విని (2) ఉన్నారు.

కొత్లాపూర్ గ్రామంలో ఒకే కుబుంబానికి చెందిన అన్నదమ్ముళ్ల అళ్లుళ్లు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.



సంబంధిత వార్తలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి