Hyderabad Rape Case: మాజీ సీఐ రేప్ కేసులో షాకింగ్ విషయాలు, బాధితురాలి తలపై తుపాకీ పెట్టి పలుమార్లు అత్యాచారం, కోర్టుకు తగిన ఆధారాలతో సహా తుది నివేదికను సమర్పించిన పోలీసులు
నిందితుడు భార్యపై అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల ( Vanasthalipuram police ) దర్యాప్తులో వెల్లడైంది.
Hyd, August 22: హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కోరట్ల నాగేశ్వరరావు.. నిందితుడు భార్యపై అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల ( Vanasthalipuram police ) దర్యాప్తులో వెల్లడైంది. కాగా బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని కస్టడీ సమయంలో పలుమార్లు బుకాయించిన మాజీ సీఐ నాగేశ్వర రావుకు (uspended Marredpally CI K Nageshwar Rao) లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించగా అందులో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు.
దీంతో పాటూ మెజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ) స్థాయి అధికారిణి.. పలు విషయాలను రిపోర్టులో పొందుపరిచారు. నిందితుడు నాగేశ్వరరావు బాధితురాలి కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేశాడని, తగిన ఆధారాలతో సహా తుది నివేదిక సమర్పించారు. ఈ కేసులో పెండింగ్‌లో ఉన్న పలువురి స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, సాధ్యమైనంత త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు వనస్థలిపురం పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
కాగా మాజీ సీఐ కస్టడీ విచారణలో తాను తుపాకీ తీసుకెళ్లలేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే పీఎస్ రికార్డులను, సీసీటీవీ కెమెరాలను, ఇతరత్రా సాంకేతిక అంశాలను పరిశీలించిన పోలీసులకు అదంతా అబద్దమని తేలింది. సంఘటన జరిగిన మర్నాడు ఉదయం తుపాకీ స్టేషన్‌లోని ఒక అధికారికి ఇచ్చి, సరెండర్ చేసినట్లుగా రికార్డ్‌లో రాయించినట్లు విచారణలో బయటపడింది.
ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. సంఘటన జరిగిన తెల్లారి నాగేశ్వర రావు స్టేషన్‌కు వచి్చనట్లు ఎక్కడా రికార్డు కాలేదు. దీంతో సీఐ ఫోన్ లొకేషన్‌ను పరిశీలించగా.. ఆ సమయంలో నాగేశ్వర రావు ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి.
దీంతో కేసును తప్పుదారి పట్టించే యత్నం చేసిన నాగేశ్వర రావుపై వనస్థలిపురం పోలీసులు తప్పుడు డాక్యుమెంట్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. ఇక బాధితురాలి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఇంకా రాలేదని పోలీసు ఉన్నతాధికారి వివరించారు. బాధితురాలి భర్తపై ఉన్న కేసులు ట్రయల్‌కు రానున్నాయని, దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలని భావించిన సీఐ.. వివాహిత ఇంటికి వెళ్లి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.