Telangana: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Mallu Bhatti Vikramarka (Photo-X)

Hyd, July 3: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం’’ అని భట్టి అన్నారు.

రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని భట్టి తెలిపారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే

ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలి. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడని భట్టి ప్రశ్నించారు.

క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లు కబుర్లే. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. పుట్టింది బతకడానికి.. చావడానికి కాదు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని భట్టి తెలిపారు.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif