Youth Commits Suicide: పెళ్లి కావడంలేదని గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. నిర్మల్ లో ఘటన (వీడియో)
ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని కొందరు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మరికొందరు, పెళ్లికాలేదని మరికొందరు.. సూసైడ్ కు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
Hyderabad, Aug 7: యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఎగ్జామ్స్ (Exams) లో ఫెయిల్ (Fail) అయ్యామని కొందరు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మరికొందరు, పెళ్లికాలేదని (Marriage) మరికొందరు.. సూసైడ్ కు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. నిర్మల్ లోని భైంసా పట్టణంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పట్టణంలోని కుంట ఏరియాలో ఇమ్రాన్ అనే 24 ఏండ్ల యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, తోటివారికి పెండ్లి కావడం, తనకు పెళ్లి కాకపోవడంతో కొద్దిరోజులుగా ఆవేదనతో ఉండేవాడు.
దారుణమైన నిర్ణయం
అయితే, ఇటీవల పెళ్లి ఆలోచనలు ఎక్కువ కావడం, తన పెళ్లిపై ఇంట్లో వాళ్లు ఆసక్తి చూపకపోవడంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపం చెందిన ఇమ్రాన్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. స్థానిక గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకిన ఇమ్రాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.