First Gay Wedding in Telangana: తెలంగాణలో తొలి "గే" జంట వివాహం, పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు, ఇదేం చోద్యం రా బాబోయ్ అంటున్న నెటిజన్లు...

అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.

Same-Sex Marriage (Photo Credits: Pixabay)

ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డ్ సృష్టించారు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ ల స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెద్దల అనుమతితో అంగరంగ వైభంగా పెళ్లి కూడా చేసుకున్నారు.  సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. ఈ  వివాహ వేడుక సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.