Telangana Secretariat: తెలంగాణ సచివాలయం ఇకపై బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం, ఏకగ్రీవ తీర్మానం చేసిన తెలంగాణ అసెంబ్లీ, త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపిన సీఎం కేసీఆర్

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయం తీసుకుంది.

Telangana New Secretariat (Photo-TS CMO)

Hyd, Sep 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ (Chief Minister K Chandrashekhar Rao) మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.

సచివాలయానికి అంబేద్కర్‌ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్‌ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు.

హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్‌లో పోస్టర్లు, కంటోన్మెంట్ యువత పేరుతో వెలసిన పోస్టర్లు

పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్