కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సంగతి విదితమే. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ వద్ద అమిత్ షాకు, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న అర్ధరాత్రి పోస్టర్లను అతికించారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించి 20 ప్రశ్నలను కేంద్రానికి, మోదీకి ఎక్కు పెట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎలా సహాయపడిందని పోస్టర్లలో ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరని అడిగారు.

posters-at-parade-grounds-against-HM-amit-shah-before-hyderabad-tour

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)