Sanatnagar Suspicious Deaths: బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురి శ‌వాలు, గీజ‌ర్ షాక్ కొట్టిందా? లేక ఎవ‌రైనా చంపేశారా? అనుమానాస్ప‌ద మృతిగా పోలీసుల కేసు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్‌ వెంకటేశ్‌ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, July 21: హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో (Sanatnagar) దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్‌ వెంకటేశ్‌ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు. బాత్‌రూంలో ముగ్గురి మృతదేహాలను కాలనీ వాసులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ పని చేస్తుంది. ఉదయం సమయంలో ఇంట్లో పని చేసేందుకు వచ్చింది. తన పని పూర్తి చేసుకొని బాత్‌రూం లాక్‌ చేసి ఉండడంతో వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3గంటల సమయంలో మళ్లీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. బాత్‌రూం డోర్‌ లాక్‌ చేసి ఉండడంతో అనుమానం వచ్చి పక్కనే నివాసం ఉంటున్న వారికి సమాచారం అందించింది. కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాత్‌రూం రోడ్‌ను పగులగొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులై కనిపించారు.

Andhra pradesh Shocker: అక్రమ సంబంధం అనుమానం, కిరాతకంగా భార్యను చంపిన భర్త, నిడదవోలులో విషాదం 

అయితే, మొదటి విద్యుదాఘాతంతో చనిపోయారని పోలీసులు భావించినా.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి చెందారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కరెంటు షాక్‌తో మృతి చెందారనే ఆనవాళ్లు కనిపించలేదు. గీజర్‌, మరో విద్యుత్‌ వైరును తాకినట్లుగా పోలీసులకు ఆధారాలు కనిపించలేదు. దీంతో పోలీసులు క్లూస్‌ టీంను రప్పించి.. ఆధారాలను సేకరిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. అయితే, వెంకటేశ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లుగా సమాచారం. భార్యాభర్తలు, కొడుకు మృతితో అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి సమాచారం చెప్పేందుకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మృతుల కుటుంబం, బంధువుల గురించి ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.