Khammam Accident: ఖమ్మంలో ఘోరరోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, తల్లిదండ్రులతో పాటూ 13 ఏళ్ల కుమారుడి మరణంతో విషాదఛాయలు

గురువారం ఉదయం కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తరలించారు.

Road Accident (Representational Image)

Khammam, June 01: ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తరలించారు. ఎదురుగా వెళ్తున్న లారీ బ్రేకు వేయడంతో కారు ఢీకొన్నదని, దీంతో కారు వెనక వస్తున్న మరో లారీ దానిని గుద్దిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Fire Accident in Tirupati: తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు మృతి, మరో ఇద్దిరికి గాయాలు, టపాకాయల నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు 

కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ (13)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.