TRS-BJP Clash at Telangana Chowk: టీఆర్ఎస్, బీజేపీ ఫైటింగ్..కిందపడిన ఎస్ఐ, తెలంగాణ చౌక్ వేదికగా దాడికి దిగిన ఇరుపార్టీల నాయకులు, పలువురికి గాయాలు, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కరీంనగర్ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గొడవకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం తెలంగాణ చౌక్ వద్ద పరస్పరం దాడి చేసుకునే స్థాయికి (TRS & BJP Clash) చేరింది.
Karimnagar, Jan 25: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కరీంనగర్ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గొడవకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం తెలంగాణ చౌక్ వద్ద పరస్పరం దాడి చేసుకునే స్థాయికి (TRS & BJP Clash) చేరింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం అందించారు.
సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్‌ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి.
కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు.
Here's Clash Visuals
బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్‌ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు (Two Town circle inspector Laxman Babu) కిందపడ్డారు.
దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పలువురికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రిలో చేర్పించారు.తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు.
టీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ బాంబు టీఆర్‌ఎస్ పార్టీని (TRS Party) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ని (KTR) సీఎం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister K. Chandrashekar Rao) పూజలు చేశారని చెప్పిన బండి సంజయ్.. వాటిని కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారన్నారు. పూజా సామగ్రి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిపేసి వచ్చారన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన వెంటనే టీఆర్‌ఎస్ పార్టీలో అణుబాంబు పేలుతుందంటూ షాకిచ్చారు. ఆయన సీఎం కావడం ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఇష్టం లేదంటూ బాంబు పేల్చారు. కేసీఆర్ వాస్తవాలు చెప్పాలని బండి సంజయ్ సూచించారు. కేసీఆర్ నటనను ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ అవాస్తమన్నారు.
మరోవైపు బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని కేసీఆర్ కావాలనే తన అనుకూలమైన వ్యక్తులతో చెప్పిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్‌ని సీఎం చేసే విషయం కూడా కేంద్ర పెద్దలకు చెప్పొచ్చానని.. అదే విషయం మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కి దమ్ముంటే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ నద్దాలను కలుద్దామని సవాల్ విసిరారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)