TRS Leader Attack on Toll Plaza: నన్నే టోల్ అడుగుతారా అంటూ టోల్ సిబ్బందిపై టీఆర్‌ఎస్ నేత దాడి, ఫాస్టాగ్ విషయంలో టోల్ సిబ్బందిపై దాడి, షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత
టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశాడు మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ నేత ప్రనిల్ చందర్ . ఫాస్టాగ్ విషయంలో టోల్ ప్లాజా (thrashed ) సిబ్బందితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాడికి దిగిన ప్రనిల్ చందర్ మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ లీడర్, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడిగా గుర్తించారు
Hyderabad, SEP 21: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar ) సమీపంలోని టోల్ ప్లాజా (Toll plaza) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశాడు మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ నేత ప్రనిల్ చందర్ (Pranil chander). ఫాస్టాగ్ విషయంలో టోల్ ప్లాజా (thrashed ) సిబ్బందితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాడికి దిగిన ప్రనిల్ చందర్ మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ లీడర్, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడిగా గుర్తించారు. అక్కడితో ఆగకుండా తన అనుచరులతో టోల్ ప్లాజాపై దాడి చేయించారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footege) వెలుగులోకి వచ్చింది.
ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో టోల్ సిబ్బంది ప్రనిల్ చందర్ ను నిలిపివేశారు. దాంతో కోపోద్రిక్తుడైన టీఆర్‌ఎస్ నేత...కారు నుంచి కిందకు దిగి దాడి చేశాడు. మొదట సిబ్బందిపై చేయి చేసుకున్న ప్రనిల్ చందర్ దౌర్జన్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత తన అనుచరులను రప్పించి దాడులు చేయించారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని సర్పంచ్ ప్రనిల్ చందర్ ఇష్టానుసారంగా వ్యవహరించారని టోల్‌ప్లాజ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయనపై చటారీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిసి ఫుటేజీలో అతను వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.