TRS Plenary Meeting 2022: ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, బిజెపిది వైఫల్యాల చరిత్ర, టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు.
Hyd, April 27: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు కేసీఆర్ జీవకళ తీసుకొచ్చారని అన్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. బుధవారం టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల (TRS Plenary Meeting) సందర్భంగా ఆయన మాట్లాడారు
టీఎస్ ఐపాస్‌లా కేంద్రం సింగిల్ విండో తీసుకొచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మత, కుల పిచ్చిలేని సంక్షేమ దిశలో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాల చరిత్ర బీజేపీదన్నారు. దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు.. విజన్ ఉన్న నాయకుడు కావాలన్నారు.
దేశానికి టెలివిజన్ నాయకుడు కాదని, విజన్ ఉన్న నాయకుడు కావాలని ( Country needs KCR's leadership) ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి అన్నారు. ప్రస్తుత సమయంలో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపిది వైఫల్యాల చరిత్ర అని అన్నారు. రైతులను ఫణంగా పెట్టి మోదీ (Prime Minister Narendra Modi) రైతు చట్టాలను తెచ్చారని చెప్పారు.మోదీ రైతు విరోధి అని రైతులే అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ ఇచ్చిన హామీ ఏమైంది. సిలిండర్ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది. 2022 కల్లా బుల్లెట్ రైలు తెస్తామన్నారు. ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు. నిత్యావసరాలు మొదలు.. అన్నింటా ధరలు పెంచేశారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. డబుల్ ఇంజిన్ అంటే దేశంలో ప్రజల కష్టాలు డబుల్. గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు. కరోనా సమయంలో శవాలు తేల్చారు. మత పిచ్చి లేపి రాజకీయాలు చేస్తున్నారు. గాడ్సేని ఆరాధిస్తున్నవారికి పెద్దపీట వేస్తున్నారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలని యువత కోరుతుంది. బుల్డోజర్ మోడల్ కాదు, గోల్డెన్ తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ లాంటిటార్చ్ బేరర్ దేశానికి కావాలి’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.