TSRTC Driver Died: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, అపోలో హాస్పిటల్ వద్ద భద్రత కట్టుదిట్టం, ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తుతున్న నినాదాలు
నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Hyderabad, October 13: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదు. ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఆయన శరీరం 90 శాతం కాలిపోయిందని తెలిపారు. మరోవైపు, శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారన్న వార్తతో ఆర్టీసీ ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. కన్నీటిపర్యంతం అవుతున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. మీ బెదిరింపులకు భయపడేది లేదంటున్న తెలంగాణా ప్రభుత్వం
చావు బతుకుల్లో ఉన్నాయ ఆయన నోటి నుంచి అకార్మికులు అంతా మంచిగుండాలె.. నాకేమైనా పర్వాలేదనే మాటలు ఆయన నోటి వెంట వినిపించాయని అక్కడివారు చెబుతున్నారు.డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందడంతో అపోలో హాస్పిటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని రంగంలోకి పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.