TS Govt: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం, ఏకంగా 54 మంది నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు

ఇదిలా ఉండగా.. రెండు రోజుల కింద సర్కారు.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగించిన విషయం తెలిసిందే. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను సైతం రద్దు చేసింది.

CM Revanth Reddy (PIC@ X)

Hyderabad, DEC 10: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్‌ చైర్మన్ల (Corporation Chairmans) నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే.

Telangana CM Revanth Reddy visits Yashoda Hospital: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. 

గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కింద సర్కారు.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగించిన విషయం తెలిసిందే. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను సైతం రద్దు చేసింది.



సంబంధిత వార్తలు