TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత

ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in లింక్ ద్వారా చెక్ చేసుకోండి

Representational Image (Photo Credits: PTI)

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు (TS Inter Result 2022) విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in లింక్ ద్వారా చెక్ చేసుకోండి

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది హాజరు కాగా, సెకండియర్ పరీక్షలు 4,42,768 మంది రాశారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https:// examresults.ts.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల్లో 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకున్న ఇంటర్ బోర్డ్, రాష్ట్ర విద్యాశాఖ చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

బోర్డ్ వెబ్ సైట్లో ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

Step 1: ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు మొదటగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో ఇంటర్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.