Outer Ring Rail: ఔటర్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు, సర్వేకోసం రూ.14 కోట్లు కేటాయింపు, తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్లాన్‌

ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు.

Outer Ring Rail (file PIC)

Hyderabad, June 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm KCR)ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకంగా చెప్తూ వస్తోన్న రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ రోడ్డు నిర్మాణంపై ఒకేసారి ఇరు ప్రభుత్వాలు (కేంద్ర, రాష్ట్ర) తమ ఆమోదాన్ని ప్రకటించాయి. 2023 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. భూసేకరణ వేగవంతంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, రీజనల్ రింగ్ రోడ్డు వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Navaratnalu Pedalandariki Illu: గుడ్ న్యూస్, జూలై 8న అమరావతిలో 47వేల గృహాలకు శంకుస్థాపన, నిరుపేదల సొంతింటి కల సాకారం చేయనున్న జగన్ సర్కారు 

ఇక దీనికి తోడు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ (Outer Ring rail) ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు.

Ammavodi: జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల 

ఇప్పుడు నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతుందని, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు లాభం చేకూరుతుందని, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని ఒక ప్రకటనలో కేంద్రం పేర్కొంది.