Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: Twitter@AndhraPradeshCM)

తాడేపల్లి, జూన్ 28: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

సీఆర్‌డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు. అజయ్‌ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్‌ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి.

జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల

ఇప్పటికే ల్యాండ్‌ లెవెలింగ్‌ కోసం సీఆర్‌డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజ్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌, షేర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్‌–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.