UPI Services in City Buses: తప్పిన చిల్లర తిప్పలు.. సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు.. 2,500 పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే

హైదరాబాద్ లోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది.

RBI raises UPI Lite transactions limit. (Photo credits: Pixabay)

Hyderabad, Sep 30: హైదరాబాద్ (Hyderabad) లోని అన్ని రకాల సిటీ బస్సుల్లో (City Buses) యూపీఐ డిజిటల్‌ (UPI Digital) లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో దాదాపు 2,500 పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ మొదలుకానున్నది.

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

ఇప్పటికే, ఆ సర్వీసుల్లో

ఇప్పటికే, ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే నగరంలోని ఎయిర్‌పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్‌ జారీ చేస్తున్నారు. తాజాగా సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐ-టీమ్స్‌ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు తెలిపారు.

Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన