Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్ దిగ్గజం యాంజెన్, 3,000 మందికి ఉపాధి
హైటెక్ సిటీలో RMZ స్పైర్ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.
అమెరికాకు చెందిన బయోటెక్ దిగ్గజం యాంజెన్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్ సిటీలో RMZ స్పైర్ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణలో అమ్‌జెన్ బయోటెక్ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
ఆర్జిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, లైఫ్ సైన్స్‌తో పాటు కాలక్రమేణా ఇతర అదనపు గ్లోబల్ సామర్థ్యాలతో సహా యాంజెన్ వ్యాపారంలోని కీలక రంగాలను బలోపేతం చేసే సేవలను నగరం నుంచి అందించనుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈ యాంజెన్ సంస్థ 40 ఏళ్లుగా బయోటెక్నాలజీలో అగ్రగామిగా ఉంది. యాంజెన్ (2023లో) 28.20 బిలియన్ డాలర్ల ఆదాయంతో దాదాపు 27 వేల మంది ఉద్యోగులతో ప్రపంచంలోని ప్రముఖ బయోటెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది.