Amgen announced to open a new technology and innovation site in Hyderabad, Telangana(X)

America, Aug 9: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కాగా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్ బయోటెక్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.

సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాగా హైదరాబాద్ హైటెక్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. 3,000 మంది ప్రతిభావంతులైన వారికి అవకాశం ఇవ్వనుండగా అమ్‌జెన్‌ ఏర్పాటు చేసే ఈ కేంద్రంతో AI, డేటా సైన్స్, లైఫ్ సైన్సెస్ మరియు మరిన్నింటిలో అత్యాధునిక అభివృద్ధికి ఇండియా కేంద్రంగా మారనుంది.

తెలంగాణ పెట్టుబడుల్లో ఇదో మైలు రాయి అని ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్‌ హైదరాబాద్‌కు రావడం గర్వకారణం అన్నారు. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు.

అలాగే డల్లాస్ లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని తెలిపారు రేవంత్ రెడ్డి. స్పష్టం చేశారు సీఎం. ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్

Here's Tweet:

హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని వెల్లడించారు. రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ వార్షిక ఉత్సవానికి రావల్సిందిగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షులు సహా స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరుకానున్నారు.