MLC Kavitha: ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దు.. కల్వకుంట్ల కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు.

Vijayashanti (Credits: X)

Hyderabad, Sep 15: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు (ED Notices) అందుకున్న బీఆర్ఎస్ (BRS) నేత, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితపై (MLC Kavitha) బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) సానూభూతి వ్యక్తి చేశారు. ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ నోటీసులు కక్ష్య సాధింపు చర్యలో భాగమని కవిత పేర్కొనడాన్ని మాత్రం తప్పుబట్టారు. ఈ పరిణామంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Aliens: ఏండ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలో ఏమున్నదంటే?

ఇంతకీ విజయశాంతి ఏమన్నారంటే..

‘‘ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే... బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ... జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు. గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆరెస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నది. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు... ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది.

జై శ్రీరామ్

హర హర మహాదేవ

జై తెలంగాణ ’’ అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి