Vikarabad Road Accident: పొగమంచే కొంపముంచిందా.. వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో,లారీ, బస్సు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ప్రమాద స్థలాన్నిసందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటన

మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండాకు సమీపంలో లారీ... ఆర్టీసీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Vikarabad Road Accident (Photo-Twitter)

Vikarabad, Dec 26: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vikarabad Road Accident) చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండాకు సమీపంలో లారీ... ఆర్టీసీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా.. పని కోసం వెళుతున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా కూలీలుగా గుర్తించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.

ప్రమాదం జరిగిన తీరు ఇదే : మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి-మోమిన్‌పేట ప్రధాన రోడ్డుపైన ఒకే కుటుంబానికి చెందినవారు ఆటోలో ఎక్కారు. మండలంలోని శంకర్‌పల్లి వద్ద పత్తి తీసేందుకు చిట్టంపల్లి నుంచి వీరు ఆటోలో వెళ్తున్నారు. అయితే మరికొంత మంది కూలీల కోసం ఇజ్రా చిట్టంపల్లి గేట్ వద్ద ఆటో ఆగింది. అంతలోనే తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చి ఆటో ముందు ఆగింది. వెనుకాలే లారీ వేగంగా వస్తోంది. ఇది గమనించని ఆటో డ్రైవర్ బండి ముందుకు తీశాడు.

ఆకలే వారి పాలిట యమపాశమైంది, జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఉస్మానియా ఆస్పత్రిలో మరొకరికి చికిత్స, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన

దీంతో లారీ ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూపుకెళ్లి మూడు పల్టీలు కొట్టింది. లారీ తాకిడికీ బస్సు కూడా కొద్దిగా ధ్వంసమైంది. ఆటోలో ఎక్కి కూర్చున్న కుటుంబ సభ్యుల్లో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఉన్న వారూ తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు.

పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతులు సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు. వికారాబాద్‌ రోడ్డు ప్రమాద మృతుల బంధువులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.