Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని వాదనలు, హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వివేకా కూతురు
దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Hyd, April 20: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కరరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో సీబీఐ విచారణ తీరుపై భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీలో సీబీఐ సుప్రీం గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం తెలిపారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని పేర్కొంది. విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న హైకోర్టు.. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది.
భాస్కర్‌రెడ్డి అనారోగ్యం దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని పేర్కొంది. విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న హైకోర్టు.. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. భాస్కర్‌రెడ్డి అనారోగ్యం దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది.
దీంతో పాటుగా వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ(CBI) కోరింది. నిందితుడి బెయిల్ రద్దు పై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో గంగిరెడ్డి కీలకమని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కుట్ర, హత్య చేయడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర. సిట్ ఛార్జ్‌షీట్ వేయనందునే ఆయనకు బెయిల్ వచ్చింది. దర్యాప్తు కీలకదశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి. హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించిందని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయరాదన్నారు. సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనను సమర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
ఇక ఇదే కేసు (Viveka Murder Case) వ్యవహారంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి (Suneetha Narreddy)సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంలో సునీత దాఖలు చేసిన పిటిషన్ అంశాన్ని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఎదుట ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
అవినాష్ ఈనెల 25 వరకు ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సునీత సుప్రీంను ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరికి పోలీసు శాఖ అదనపు భద్రత కల్పించింది. ఇప్పటి వరకు 1+1 బందోబస్తు ఉండగా.. 1+5 భద్రత కల్పిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దస్తగిరి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయడంతో కొన్ని గంటల్లోనే స్పందించిన పోలీసులు అదనపు భద్రతకు చర్యలు తీసుకున్నారు.