Warangal West: హాట్ టాపిక్‌గా వరంగల్ రాజకీయాలు, నాయిని వర్సెస్ దాస్యం మధ్య ఫైట్,రోజుకో సవాల్‌

ఈ జిల్లా నుండి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించగా నిత్యం వారి మధ్య మాటల యుద్ధం, వివాదాలే. కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు, దయాకర్ రావు వర్సెస్ కడియం, కడియం వర్సెస్ తాటికొండ రాజయ్య

warangal west(X)

తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ జిల్లా పాలిటిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుండి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించగా నిత్యం వారి మధ్య మాటల యుద్ధం, వివాదాలే. కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు, దయాకర్ రావు వర్సెస్ కడియం, కడియం వర్సెస్ తాటికొండ రాజయ్య, కొండా ఫ్యామిలీ వర్సెస్ ఎర్రబెల్లి ఫ్యామిలీ మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఒకడుగు ముందుకేస్తే ఆయా పార్టీల్లో నేతల మధ్య సయోధ్య ఉండని సందర్భాలు ఎన్నో.

ఇక తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ స్థానాన్ని దాదాపు 20 సంవత్సరాల తర్వాత చేజిక్కించుకుంది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నాయిని రాజేందర్ రెడ్డి గత ఎన్నికల్లో విజేతగా నిలిచారు. వరుసగా గెలుస్తూ వస్తున్న దాస్యం వినయ్ భాస్కర్‌పై గెలుపొందారు నాయిని.

అప్పటినుండి వరంగల్ పశ్చిమ రాజకీయాలు నాయిని వర్సెస్ దాస్యంగా మారిపోయాయి.నువ్వెంత అంటే నువ్వెంత అని రోజుకో సవాల్‌తో హీట్ పుట్టిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి కేరాఫ్‌గా మారింది హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయం. నిబంధనలకు విరుద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, కూల్చివేతలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. దీని వెనుక ఉంది నాయిని రాజేందర్ రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు దాస్యం. పార్టీ ఆఫీసు కోసమని ప్రభుత్వం వద్ద స్థలం తీసుకున్న అందులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ను కాంగ్రెస్ నడుపుతోందని మండిపడ్డారు.

సమాచార హక్కు చట్టాన్ని అస్త్రం చేసుకుని రాజేందర్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన బీఆర్ఎస్ పార్టీని వదలట్లేదు నాయిని. అయితే కాంగ్రెస్ విమర్శలను అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు దాస్యం. తగ్గేదేలే అని చెబుతున్నారు. దీంతో రోజుకో ఆరోపణ, ప్రత్యారోపణతో స్థానికంగా హీట్ పెంచేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. మొత్తంగా వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్ష



సంబంధిత వార్తలు