IPL Auction 2025 Live

Cold Wave Sweeps Telangana: తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, వణుకుతున్న గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి (mercury drops below 5 degrees) పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.6 డిగ్రీల సెల్సీయస్‌ నమోదయింది.

Representational Image (Photo Credits: IANS)

Hyd, Jan 9: ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణపై చలిపంజా (Cold Wave Sweeps Telangana) విసురుతున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి (mercury drops below 5 degrees) పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.6 డిగ్రీల సెల్సీయస్‌ నమోదయింది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌లో 4.7, సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లిలో 5.7, న్యాల్కల్‌లో 5.9 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 7.5 డిగ్రీలు, మెదక్‌ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్‌లలో 8 డిగ్రీ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

మధ్యప్రదేశ్‌, విదర్భ ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, వారం తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల జేఏసీ కీల‌క నిర్ణ‌యం, మా భూములు తిరిగి ఇవ్వాలంటూ ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం..

రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కప్పేసింది. తొలిసారిగా గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు 12.8 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 28.3 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఒక్కసారిగా పెరిగిన చలితో గ్రేటర్‌ ప్రజలు వణికిపోయారు. రాబోయే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్‌లో 7.2 డిగ్రీలు, భద్రాచలం 14, దుండిగల్‌ 14, హకీంపేట 13.8, హనుమకొండ 12, హైదరాబాద్‌ 12.8, ఖమ్మం 12.6, మహబూబ్‌నగర్‌ 16.2, మెదక్‌ 11, నల్లగొండ 16.4, మెదక్‌ 14.3, రామగుండంలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్‌(యు)లో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణిలో 6.4 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు వీడలేదు. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు.



సంబంధిత వార్తలు

SC Dismisses Plea for Ballot Paper: పేప‌ర్ బ్యాలెట్‌తో ఎన్నిక‌లు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు