'Where is KCR': కేసీఆర్ కనపడుట లేదు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన యువకుడు, కేసీఆర్ ఎక్కడో చెప్పాలంటూ ప్రగతి భవన్ వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన, అరెస్ట్
హైదరాబాద్ లో (Hyderabad Covid 19) కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి. అయితే ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టే సీఎం గత నాలుగు అయిదు రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. దీంతో పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad, July 9: తెలంగాణ కరోనా కేసులు (Telangana Coronavirus) రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో (Hyderabad Covid 19) కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి. అయితే ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టే సీఎం గత నాలుగు అయిదు రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. దీంతో పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ఎక్కడ? తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జాడ ఏదంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్
ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన చేశాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ప్రగతిభవన్ ఎగ్జిట్ గేటు వద్ద ప్ల కార్డు పట్టుకుని నిరసన తెలిపి మెరుపు వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ (Where is KCR. He is my CM. It''s my right to know) అని ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ ఫేక్ వార్త, లోకల్ జర్నలిస్టుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన #WhereIsKCR హ్యాష్ ట్యాగ్
పోలీసులు (Hyderabad police) సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి నిరసనకారుడిని అరెస్ట్ చేశారు. యువకుడితో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులను, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. స్టేషన్ కెళ్లి అరెస్ట్ అయిన వారిని పరామర్శించనున్నారు.
Here's Netizen Tweet
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల అనంతరం నుంచి కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించలేదు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రగతి భవన్‌లో పలువురు సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకడంతో సీఎం కేసీఆర్‌కు కూడా సంక్రమించి ఉంటుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో 30 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1924 కేసులు నమోదు, రాష్ట్రంలో 324కు పెరిగిన కరోనా మరణాలు
విపక్షాలు కూడా సీఎం కేసీఆర్ కనిపించకపోవడంపై(Where is KCR) విమర్శలకు మరింత పదును పెడుతున్నాయి. సీఎం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఆయన ఆరోగ్యం గురించి చెప్పాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్ (Telangana High Court) కూడా దాఖలైంది. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ కేసీఆర్ ఎక్కడున్నారనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.